6 September 2017

వినాయక చవితి

వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్ధన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానం లో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు)

ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కనుక పార్వతీ పుత్రుణ్ని వినాయకుడంటారని అమరం చెబుతోంది. సర్వప్రకృతికి మేలు చేకూర్చే గణపతిని పూజచేసే విధానమూ విశిష్టమైందే. వినాయక చవితినుంచి తొమ్మిది రోజులపాటు కొనసాగే వినాయక పూజలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గణపతి తత్వం నేటి పర్యావరణ లక్ష్యానికి దగ్గరగా ఉంటుంది. ప్రకృతికీ, ప్రాణికి మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని సూచిస్తుంది.

మహోన్నతమైన హైందవ ధర్మంలో మహర్షులు మూలికల్ని, ఓషధుల్ని పూజాద్రవ్యాలుగా, యాగాది క్రతువుల్లో సమిధలుగా వినియోగించడమనే సంప్రదాయాన్ని ఆరంభించారు.

వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు (కుమారస్వామి వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు , నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రదము. హిందూ సంప్రదాయము తో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.

భారతీయులకు గణపతి జీవనాధారమైన ఒక మూలతత్వము . భారతీయ హిందువులు ప్రతి పనికి ముందు గణేష్ ని పూజించి తమ పనులు చేసుకుపోతుంటారు .

శ్లోకములు




1.                మహా గణపతి
2.                మహా శివుడు
3.                మహా విష్ణువు
4.                సూర్యనారాయణుడు
5.                హనుమాన్
6.                శనీశ్వరుడు
7.                శ్రీ రాముడు
8.               శ్రీ కృష్ణుడు
9.                సరస్వతి దేవి
10.          శ్రీ లక్ష్మి దేవి
11.          శ్రీ గాయత్రి
12.          నవ గ్రహ స్తోత్రములు
13.           మంత్రపుష్పం
14.           వేంకటేశ్వర ప్రార్ధన
15.           దుర్గాదేవి ప్రార్ధన
16.           శ్రీ దక్షిణామూర్తి
17.           శ్రీ గుర్వష్టకం
18.           శ్రీ కాలభైరవాష్టకం
19.           శ్రీ తులసి ప్రార్ధన
20.           శ్రీ లలిత దేవి ప్రార్ధన
21.           శ్రీ చతుర్ముఖ బ్రహ్మ
22.          శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం
23.          అంతరంగ ప్రార్ధన
24.          మంగళహారతులు

వ్రతములు

ఆంధ్ర ప్రదేశ్ - దేవాలయములు

ఆంధ్ర ప్రదేశ్
అరసవిల్లి, శ్రీకాకుళం
సూర్య నారాయణ స్వామి        
శ్రీ కూర్మం, శ్రీకాకుళం
శ్రీ కూర్మనాధ స్వామి
శ్రీ ముఖలింగం, శ్రీకాకుళం
శ్రీ ముఖలింగేశ్వర స్వామి
దేవీపురం, విశాఖపట్నం
లలిత త్రిపుర సుందరి దేవి
నూకాంబికా దేవి దేవాలయము, విశాఖపట్నం
నూకాంబికా దేవి
సింహాచలం, విశాఖపట్నం
వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయము
అన్నవరం, తూర్పుగోదావరి
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి
ద్రాక్షారామం, తూర్పుగోదావరి
భీమేశ్వర స్వామి (పంచారామమ్)
సామర్లకోట, తూర్పుగోదావరి
శ్రీ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి (పంచారామమ్)
ర్యాలి, తూర్పుగోదావరి
జగన్మోహిని కేశవస్వామి, ఉమా కమండలేశ్వర స్వామి
పిఠాపురం, తూర్పుగోదావరి
కుక్కుటేశ్వర స్వామి
అంతర్వేది, తూర్పుగోదావరి
లక్ష్మి నరసింహ స్వామి దేవాలయము
అంతర్వేది, తూర్పుగోదావరి
నీలకంటేశ్వర స్వామి
ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి
వేంకటేశ్వర స్వామి
పాలకొల్లు, పశ్చిమ గోదావరి
క్షీర రామలింగేశ్వర స్వామి (పంచారామమ్)
భీమవరం, పశ్చిమ గోదావరి
సోమేశ్వర స్వామి (పంచారామమ్)

పండుగలు

  1. వినాయక చవితి
  2. ఉగాది
  3.  శ్రీరామనవమి 
  4.  అట్లతదియ - అట్ల తద్ది
  5.  అక్షయతృతీయ
  6. నాగపంచమి
  7.  కృష్ణజయంతి
  8. ముక్కోటి ఏకాదశి
  9. భీష్మైకాదశి - భీష్మాష్టమి
  10.  శ్రావణపూర్ణిమ - రాఖీపూర్నిమ (రాఖీ పండగ)
  11. విజయదశమి-నవరాత్రోత్సవం (దసరా)
12.   దీపావళి
13.   మకరసంక్రాంతి
14.   రథసప్తమి
15.   మహాశివరాత్రి
16.   హోలీ
17.   వసంతపంచమి
18.   సుబ్రహ్మణ్య షష్టి
19.   హనుమజ్జయంతి
20.   వరలక్ష్మీ వ్రతము
21.   పోలేరమ్మ వ్రతం

14 May 2016

కృష్ణాష్టమి

సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు... దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు రోహిణి నక్షత్రమున ... కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. 

హిందూమతానికి ఆదర్శగ్రంధమైన గీతా సారాంశాన్ని అందించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మ దినమైన శ్రీకృష్ణాష్టమి వేళ శ్రీ కృష్ణ దేవాలయాలను దర్శిస్తే జన్మ జన్మలకు సరిపోయే పుణ్యఫలం భక్తుల సొంతమౌతుంది. అందుకే కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణ దేవాలయాలను గానీ, గౌడీయ మఠాలను గానీ దర్శిస్తే చాలా శుభప్రదం. దేవాలయాన్ని సందర్శన సమయంలో కృష్ణ ధ్యాన శ్లోకములు పఠిస్తే చాలా మంచిది. అలాగే ఆ దేవదేవుని సన్నిధిలో అష్టోత్తర పూజను చేయిస్తే చేయించిన వారికి సఖల సుఖాలు సొంతమౌతాయి. దీనితోపాటు కృష్ణ సహస్రనామ పూజను కూడా చేయిస్తే చాలా మంచిది. శ్రీకృష్ణుని లీలా వినోద మాలిక శ్రీభాగవతం గ్రంధాన్ని కొని దాన్ని పఠించగల్గితే స్వర్గ సౌఖ్యం సొంతమౌతుంది. కృష్ణాష్ఠమి సందర్భంగా సన్నిహితులకు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందించడం శుభకరం.

Naga Panchami

శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు చెప్తున్నారు.

అందుచేత శ్రావణమాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.

నాగ పంచమి వ్రత కద :

పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుండేది.  ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తూండేవి, దానితో ఆమె భయకంపితురాలైంది. ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విని "అమ్మా" నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు, అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని, పాముల భయం తొలగి పోతుందని చెప్పెను. ఆమె ఆవిధంగా ఆ నోమునోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది. నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి.
WORLD CLOCK