14 May 2016

కృష్ణాష్టమి

సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు... దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు రోహిణి నక్షత్రమున ... కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. 

హిందూమతానికి ఆదర్శగ్రంధమైన గీతా సారాంశాన్ని అందించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మ దినమైన శ్రీకృష్ణాష్టమి వేళ శ్రీ కృష్ణ దేవాలయాలను దర్శిస్తే జన్మ జన్మలకు సరిపోయే పుణ్యఫలం భక్తుల సొంతమౌతుంది. అందుకే కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణ దేవాలయాలను గానీ, గౌడీయ మఠాలను గానీ దర్శిస్తే చాలా శుభప్రదం. దేవాలయాన్ని సందర్శన సమయంలో కృష్ణ ధ్యాన శ్లోకములు పఠిస్తే చాలా మంచిది. అలాగే ఆ దేవదేవుని సన్నిధిలో అష్టోత్తర పూజను చేయిస్తే చేయించిన వారికి సఖల సుఖాలు సొంతమౌతాయి. దీనితోపాటు కృష్ణ సహస్రనామ పూజను కూడా చేయిస్తే చాలా మంచిది. శ్రీకృష్ణుని లీలా వినోద మాలిక శ్రీభాగవతం గ్రంధాన్ని కొని దాన్ని పఠించగల్గితే స్వర్గ సౌఖ్యం సొంతమౌతుంది. కృష్ణాష్ఠమి సందర్భంగా సన్నిహితులకు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందించడం శుభకరం.

No comments:

Post a Comment

WORLD CLOCK